సమావేశములు

ఎ) మహాజన సభ: సాధారణ మహాజన సమావేశము సంవత్సరమునకు కనీసము రెండు పర్యాయములు జరుపవలెను. సమావేశము తేది ఎజెండా సబ్యులకు 15 రోజులు ముందుగా తెలియపరచవలెను.. సదరు అత్యవసర సమావేశము వివరములను సభ్యులకు ఫోను ద్వారా గాని, ఎస్.ఎమ్.ఎస్ ద్వారా గాని లేదా ఈమెయిల్ ద్వారా గాని తెలియపరచవలెను.

బి). కార్యనిర్వాహక సమావేశములు:

1). కార్యనిర్వాహకవర్గ సభ్యనిగా ఎన్నిక కాబడుటకు సదరు సభ్యులు కనీసము 3 సంవత్సరములు సభ్యునిగా ఉండవలెను..
2). మూడునెలలకు ఒక పర్యాయము కార్యనిర్వాహకవర్గ సమావేశము జరుపవలెను. ఈ సమావేశ వివరములు సభ్యులకు ఒక వారం రోజులు ముందుగా తెలియ పరచవలెను.
౩). అత్యవసర కార్యనిర్వాహకవర్గ సమావెశమును అవసరమును అనుసరించి ఎప్పడైనను జరుపవచ్చును. ఈసమావేశము వివరములను సభ్యులకు ఫోను ద్వారా గాని, ఎస్.ఎమ్.ఎస్ ద్వారా గాని లేదా ఈమెయిల్ ద్వారా గాని తెలియపరచవలెను.
4). సాధారణ కార్య నిర్వాహక వర్గ / మహాజన సభ సమావేశము లలో తీసుకొను నిర్ణయములు సభ్యులకు సర్క్యులేషన్ ద్వారా తెలియపర్చబడును. 5). మహాజన సభలొ హాజరుకాని సభ్యులు కార్యనిర్వాహక మరియు ఏ ఇతర కమిటీలలో సభ్యులు గా ఉండుటకు అర్హులు కాదు.

కోరం:

ఎ). కార్యనిర్వాహక వర్గము సమావేశము నకు కోరం మొత్తము సభ్యులలో సగము, మహాజన సభ సమావేశమునకు మెత్తము సభ్యులలో 1/4 వ వంతు హాజరు అయినచో కోరం గా పరిగనింపబడును.

బి) కార్యనిర్వాహక వర్గ / మహాజన సమావేశములో నిర్ణయములు తీసుకొను సమయములో కోరం కు సరిపడే సభ్యులు తప్పని సరిగా హాజరు కావలెను.

మహాజన సభ చర్చించు విషయములు:

ఎ)  కార్యనిర్వాహక వర్గము యొక్క అకౌంట్సు, రిపోర్ట్లు, తీర్మానములు ఆమోదించుట.
బి)  కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకొనుట.
సి). సంవత్సర ఆదాయము మరియు వ్యయ పట్టికను అమోదించుట.
డి).  మహాజన సభ సమావేశములో అజెండాలోని ఇతర విషయములు సభ్యులు చర్చించుటకు అవకాశము కల్పించుట, మరియు అటువంటి విషయములు సమావేశము నకు 24 గంటలు ముందుగా ముఖ్య కార్యదర్శిగారికి లిఖిత పూర్వకముగా తెలియపర్చవలెను.
ఇ).  మహాజనసభకు నియమ నిభంధనలను మార్పు చేయుటకు అధికారము కలదు. సదరు మార్పు చేయుటకు మొత్తము  సభ్యులలో 2/3 వంతు సభ్యులు అంగీకరించవలెను
ఎఫ్).  సదరు మార్పు చేయు నిభంధనలను సభ్యులకు వారం రోజులు ముందుగా వ్రాత పూర్వకముగా మరియు ఎస్. ఎమ్.ఎస్ లెదా ఈ మెయిల్ లేదా సర్క్యులేషన్ ద్వారా తెలియపర్చవలెను.
Scroll to Top